భారత క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14న జరగనుంది. ఈ హైవోల్టేజ్ గ్రూప్ స్టేజ్ పోరుకు ఎడ్జ్‌బాస్టన్ స్టేడియమే ఆతిథ్యం ఇవ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయల్లో భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు 15 సార్లు తలపడగా, భారత్ 12 మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో నిలిచింది. చివరిసారిగా 2024 అక్టోబర్ 6న జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
ఈ నేపథ్యంలో మరోసారి భారత మహిళల జట్టు ఎలా ఆడుతుందో చూడాలనే ఆసక్తితో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Read More : విరాట్ కోహ్లీ అతిథ్యానికి యువ ఆటగాళ్ల హాజరు

One thought on “భారత్ vs పాక్ జూన్ 14న హైవోల్టేజ్ మ్యాచ్”
Comments are closed.