దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద వాహనదారులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రోడ్ల రవాణా శాఖ (MoRTH) ఆధ్వర్యంలో ప్రైవేట్ వాహనాల కోసం రూ.3,000 చెల్లిస్తే ప్రత్యేక ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను అందుబాటులోకి తెస్తోంది.
ఈ పాస్ ద్వారా ఏడాది పాటు లేదా 200 సార్లు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. టోల్ చెల్లింపులను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అమలులోకి తేనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఫాస్టాగ్ పాస్ ఆగస్టు 15 నుంచి లభ్యం కానుంది. యాక్టివేషన్ మరియు రిన్యూవల్ ప్రక్రియను “రాజ్‌మార్గ్ యాత్ర” యాప్‌తో పాటు, రోడ్లు-రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) మరియు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) అధికారిక వెబ్‌సైట్ల ద్వారా పూర్తి చేయొచ్చు.
ఈ కొత్త పాస్‌తో టోల్ గేట్ల వద్ద సమయం వృథా కాకుండా ప్రయాణం మరింత వేగంగా సాగుతుందని కేంద్రం ఆశిస్తోంది.

Read More : శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా

One thought on “ప్రైవేట్ వాహనాలకు ఫాస్టాగ్ వార్షిక పాస్”
Comments are closed.