వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా సెల్వమణి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి ఘటనపై స్పందించిన ఆమె, “మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్పా?” అంటూ ప్రశ్నించారు.
“మీ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మా పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మా నాయకుడు జగన్ వెళ్లినంత మాత్రాన తప్పేంటీ?” అని ఆమె ప్రశ్నించారు.
ఇంకా మాట్లాడుతూ, “మీ పార్టీకి చెందిన కార్యకర్తలు మృతిచెందినప్పుడు, మీరు వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించలేదా?” అంటూ తెలుగు దేశం పార్టీపై ఆమె విమర్శలు గుప్పించారు.
ఒకే విషయంలో డబుల్ స్టాండర్డ్స్ వద్దని, రాజకీయ విమర్శలకూ కొన్ని హద్దులు ఉండాలని ఆమె సూచించారు. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని రోశా పేర్కొన్నారు.

Read More : కొడాలి నాని అరెస్టు వార్తల్లో నిజం లేదు

One thought on “YSRCP కార్యకర్త మృతి”
Comments are closed.