టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కాగా, ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఈ సిరీస్‌కు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా శుభమన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ నేపథ్యంలో భారత జట్టులోని కొంతమంది సభ్యులు లండన్‌లోని కోహ్లీ నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కెప్టెన్ గిల్, ఉపకెప్టెన్ పంత్, పేసర్ మహ్మద్ సిరాజ్ సహా మరికొందరు ఆటగాళ్లు కోహ్లీ ఆహ్వానం మేరకు అతని ఇంటికి వెళ్లి, కొన్ని గంటల పాటు అతిథ్యం స్వీకరించినట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా కోహ్లీ జట్టు సభ్యులకు తన అనుభవాన్ని పంచుకుంటూ కనిపించడం విశేషంగా మారింది.
ఐపీఎల్ సీజన్ నడుమ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడంతో బీసీసీఐ గిల్‌కి పగ్గాలు అప్పగించింది. ఈ సిరీస్‌తో భారత్ కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) సైకిల్‌ను ప్రారంభించనుంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు భారత్ చేరినా, టైటిల్ చేజార్చిన విషాదం అభిమానుల్ని నిరాశపరిచింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్టుల సిరీస్ టీమిండియా కోసం అత్యంత కీలకంగా మారింది. కోహ్లీ అనుభవం, యువ ఆటగాళ్ల ఉత్సాహం కలిసి జట్టు బలాన్ని పెంచే అవకాశం ఉంది. తొలి సిరీస్‌లోనే గిల్ కెప్టెన్సీపై అంచనాలు భారీగా ఉండటంతో, ఆటగాళ్ల ఐక్యత, సాన్నిహిత్యం మరింత ముఖ్యంగా మారింది.
Read More : మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల

One thought on “విరాట్ కోహ్లీ అతిథ్యానికి యువ ఆటగాళ్ల హాజరు”
Comments are closed.