లక్నోలో సౌదీ అరేబియా విమానానికి ఒక ప్రమాదం తప్పింది. జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు వచ్చిన సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో అప్రమత్తత కలిగించిన సంఘటన చోటుచేసుకుంది. రన్‌వేపై దిగుతుండగా విమానం టైర్ నుండి పొగలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఘటనను గుర్తించిన వెంటనే విమానాశ్రయం రెస్క్యూ బృందం తక్షణమే స్పందించి పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకుంది. వారి అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా ప్రమాదం నివారించబడింది. అప్రమత్తమైన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానానికి సంబంధించిన సాంకేతిక కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇలాంటి ఘటనలపై పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
Read More : విమాన ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన

One thought on “లక్నోలో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు తప్పిన ప్రమాదం”
Comments are closed.