అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి తర్వాత తొలిసారిగా లండన్‌లో ఉన్న భర్తను కలవడానికి బయలుదేరిన నవ వధువు ఖుష్బు రాజ్‌పురోహిత్ (Balotra) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది.
ఖుష్బు గత జనవరిలో (2025) వివాహం చేసుకుంది. వివాహానంతరం భర్త లండన్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆమె అతడిని కలవడానికి తొలిసారి ప్రయాణం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఖుష్బు తన తండ్రితో కలిసి అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. కూతురిని వదిలి పంపిన తండ్రి ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు, చివరి విడిపోవడాన్ని చూపించే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హృదయాలను తడిపిస్తున్నాయి.
అయితే, ఆమె ప్రయాణం విషాదాంతంగా ముగిసింది. లండన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా AI171 బోయింగ్ 787-8 విమానం కుప్పకూలి పలువురి ప్రాణాలు తీసిన ఘటనలో ఖుష్బు కూడా మరణించింది. ఖుష్బు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read More : చెన్నై రామపురంలో మెట్రో పిల్లర్లు కూలి ఒకరు ?

One thought on “లండన్‌కు వెళ్తూ నవ వధువు మృతి”
Comments are closed.