పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం నటసింహా నందమూరి బాలకృష్ణ వినమ్రంగా స్పందించారు. ‘‘ఈ బిరుదులకు నేను అలంకారం ఏమో కానీ, నాకు బిరుదులు అలంకారం కాదు. పొరపాటున నా నటనకు ఈ అవార్డు ఇచ్చారు… కానీ నేను మాత్రం నా సేవకు ఈ అవార్డు ఇచ్చారనుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ఆయన ఆఖండ-2 షూటింగ్ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘జార్జియాలో షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడి ఉష్ణోగ్రత 4 డిగ్రీల వరకూ పడిపోయింది. షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులంతా ఒనికిపోతున్నారు. కానీ నేను మాత్రం శివలీలతో ఉత్సాహంగా నిలిచాను. అంతటి చలిలో కూడా శక్తిగా నిలబడటం ఆధ్యాత్మిక అనుభూతే’’ అని అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న “ఆఖండ-2” చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆఖండ’ సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సినిమా ప్రేమికుల ఆసక్తిని పెంచుతోంది.
Read More : ముంబై ఎయిర్పోర్ట్లో అల్లు అర్జున్ సందడి

2 thoughts on “నటుడిగా బిరుదులకు మించి సేవే పెద్దది”
Comments are closed.