ప్రతి మహిళకు నెలసరి (పీరియడ్స్) ఒక సహజ ప్రక్రియ. అయితే, ఈ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్ల తలెత్తే సమస్యల నుంచి తప్పించుకోవడానికి పరిశుభ్రత చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో శారీరకంగా ఆడవారు కొంత అసహనం అనుభవిస్తారు. దీంతో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా అలసత్వంగా వ్యవహరిస్తే, అది గర్భాశయ సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
పరిశుభ్రత కాపాడకపోతే పెరగే ప్రమాదాలు
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్లు (RTI), చర్మవ్యాధులు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒకే సానిటరీ ప్యాడ్‌ను ఎక్కువసేపు వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, దురద, చర్మంలోని దద్దుర్లు వేధించవచ్చు. ఇలాంటివి పునరావృతమైతే, గర్భాశయానికే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు తప్పక పాటించాల్సిన విషయాలు
- మంచి నాణ్యత కలిగిన శానిటరీ న్యాప్కిన్లను ఉపయోగించాలి
- ప్రతి 4 నుండి 6 గంటలకోసారి ప్యాడ్ మార్చాలి
- వాడిన ప్యాడ్‌ను కాగితంతో చుట్టి వ్యర్థంగా పారవేయాలి
- పీరియడ్స్ సమయంలో ఎక్కువ నొప్పి ఉంటే డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడాలి
ఇలాంటి సూచనలను పాటించడం వల్ల నెలసరి సమయంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారపు అలవాట్లు కూడా అవసరమేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More : ఫ్యాటీ లివర్ సంకేతాలు ముఖం మీదే కనిపిస్తాయి..!

2 thoughts on “Women Health : వైద్య నిపుణుల హెచ్చరిక”
Comments are closed.