వియత్నాంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

విదేశాల్లోని తెలుగు కుటుంబాలను కలచివేసిన విషాద ఘటన వియత్నాంలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన యువ విద్యార్థి అర్షిద్ అష్రిత్ (21) వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కాంతో సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న అష్రిత్, నిన్న తెల్లవారుజామున తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు.

150 సీసీ బైక్‌ను అతివేగంగా నడుపుతున్న సమయంలో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో అర్షిద్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు శోకసంద్రంలో మునిగిపోయారు.

అర్షిద్‌ అష్రిత్‌ కాగజ్‌నగర్ మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారిగా ఉన్న అర్జున్, ప్రతిమ దంపతుల కుమారుడు. విదేశాల్లో వైద్య విద్య కోసం వెళ్లిన ఓ యువకుడి జీవితం అకాలంలో ముగిసిన ఘటన మానవ హృదయాలను కలిచివేస్తోంది.

Read More : కొండగట్టు వద్ద పెళ్లి బృందం వాహనం ప్రమాదం

One thought on “వియత్నాంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం

Comments are closed.