శ్రీయ శరణ్ మళ్లీ తెరపై సందడి చేయనుందా?

సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన శ్రీయ శరణ్, తన నటనతో ఎన్నో సినిమాల్లో మెప్పించిన సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్రకైనా సరిపోయే తన ఫెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా, వచ్చిన అవకాశాలను వినయంగా అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్, కన్నడ సినిమాల్లో బిజీ అయ్యారు. 2022లో ‘RRR’లో అజయ్ దేవగన్ పక్కన, ‘తడ్క’, ‘దృశ్యం 2’, ‘కబ్జా’, ‘మ్యూజిక్ స్కూల్’ వంటి సినిమాల్లో కనిపించినా, పెద్దగా గుర్తింపు రాకపోయింది. ఇక ఇటీవలే సూర్య నటించిన ‘రెట్రో’ సినిమాలో స్పెషల్ రోల్ చేయగా, అది కూడా ఆశించిన రీతిలో ప్రభావం చూపలేదు.

అయితే ఇప్పుడు శ్రీయ శరణ్ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తేజా సజ్జా హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ టీజర్‌లో శ్రీయ స్పెషల్ అప్పియరెన్స్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరచారు.

హాలీవుడ్ స్థాయిలో రూపొందిన విజువల్స్‌తో మిరాయ్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీయ పాత్ర కూడా ప్రధానమైనదే అనే ఊహలు ప్రేక్షకులలో మొదలయ్యాయి. ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన తేజా సజ్జా, మళ్లీ అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు.

‘మిరాయ్’ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. టీజర్ ని బట్టి చూస్తే, శ్రియ శరణ్ పాత్ర ప్రేక్షకులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ఆశించవచ్చు.

Read More : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డులు ప్రకటించింది.

One thought on “శ్రీయ శరణ్ మళ్లీ తెరపై సందడి చేయనుందా?

Comments are closed.