సూర్యాపేటలో శిశువుల కిడ్నాప్ ముఠా

సూర్యాపేటలో శిశువుల అక్రమ రవాణా మరియు అమ్మకాల ముఠా పై పోలీసులు భారీ దాడి చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి పసిపిల్లలను కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.

అయితే అరెస్టు చేసిన వారి వద్ద ఉన్న 16 నెలల బాలుడిని పోలీసులు రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. పిల్లల కిడ్నాప్ చేయడం ద్వారా ఆ ముఠా ఒక్కొక్క పసిబిడ్డను రూ.3 లక్షల నుండి రూ.7 లక్షల వరకూ అమ్ముతూ ఉన్నట్టు విచారణలో వెల్లడైంది.

ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను ఎత్తుకెళ్లి, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా గత కొంతకాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ ముఠాలో మరెవరెవరున్నారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read More : కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకానున్న KCR