హర్యానాలోని పంచకుల జిల్లాలో దృఢహృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది సభ్యులు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన పంచకులలోని సెక్టార్ 27లో వెలుగు చూసింది. బాధితుల మృతదేహాలు రోడ్డుపై ఆపి ఉంచిన ఒక కారులో గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, ఆర్థిక సమస్యల కారణంగానే ఈ విషాదకర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై స్నేహితులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Read More : ట్రాఫిక్ పోలీసుల తీరుతో చిన్నారి మృతి

One thought on “కుటుంబ సమేతంగా ఏడు మందీ ఆత్మహత్య”
Comments are closed.