ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన గోండా జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ గోండా జిల్లా అధ్యక్షుడు అమర్ కిశోర్ కశ్యప్ ఒక మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం తక్షణమే స్పందించింది. కశ్యప్‌కు షోకాజ్ నోటీసు జారీ చేస్తూ వివరణ కోరింది.
ఈ సంఘటన ఏప్రిల్ 12న గోండా బీజేపీ జిల్లా కార్యాలయంలో చోటుచేసుకుంది. తాజాగా బయటపడ్డ సీసీటీవీ వీడియో ప్రకారం, కశ్యప్ పార్టీ ఆఫీసు మెట్ల వద్ద ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యాలు రికార్డయ్యాయి. మరో వీడియోలో ఆయన తన కారులో ఆమెను తీసుకువచ్చి ఆఫీసులోకి తీసుకెళ్తూ కనిపించారు. ఈ ఫుటేజీల ఆధారంగా జిల్లాకు చెందిన మరొక బీజేపీ నేత పార్టీ నేతల దృష్టికి విషయం తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తోందని ఆయనే ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది వాస్తవం ఎలా ఉన్నా, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోకుండా చర్యలు తీసుకుంటోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు ప్రకటించే అవకాశం ఉంది.
Read More : దేశవ్యాప్తంగా భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు.

One thought on “బీజేపీ నేతపై అసభ్య ప్రవర్తన ఆరోపణలు”
Comments are closed.