హిందీ సినీ పరిశ్రమలో విషాద వార్త వెలువడింది. పలు ప్రముఖ చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్న హీరో ముకుల్ దేవ్ (వయసు 54) శుక్రవారం రాత్రి అకస్మికంగా మరణించారు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్.. రాజ్‌కుమార్’, ‘జై హో’ వంటి హిట్ సినిమాలతో ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. ఈ అకాల మరణం బాలీవుడ్ వర్గాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
ఈ వార్త తెలిసిన వెంటనే ముకుల్ దేవ్ స్నేహితులు శనివారం ఆయన నివాసానికి చేరుకుని చివరి చూసేందుకు ప్రయత్నించారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉందని సమాచారం. ముకుల్ దేవ్ సన్నిహితురాలు, నటి దీపశిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియాలో ఈ విషాదాన్ని ధృవీకరించారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆయనతో ఉన్న పాత ఫోటోను షేర్ చేసి “RIP” అని పేర్కొన్నారు.
ముకుల్ దేవ్ ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ సోదరుడిగా కూడా తెలిసిన వ్యక్తి. ఆయన చివరిగా ‘అంత్ ది ఎండ్’ హిందీ చిత్రంలో కనిపించారు. న్యూఢిల్లీ పంజాబీ కుటుంబంలో జన్మించిన ముకుల్ దేవ్ తండ్రి హరి దేవ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన తండ్రి ద్వారా ముకుల్ దేవ్ ఆఫ్ఘాన్ సంస్కృతి పరిచయమయ్యింది. ముకుల్ దేవ్ ఈ భాషలు కూడా బాగా తెలిసిన వ్యక్తిగా, ఇంసదిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో పైలట్ శిక్షణ కూడా పొందారు.
ముకుల్ దేవ్ మరణ వార్తపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read More : మనోజ్ భావోద్వేగ ఇంటర్వ్యూ

One thought on “బాలీవుడ్ హీరో ముకుల్ దేవ్ మృతి…”
Comments are closed.