కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై మహిళ తీవ్ర ఆరోపణలు.

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. 2023 జూన్ 11న మునిరత్న తనను ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిపించి, తన అనుచరులతో కలిసి అత్యాచారం చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, ఎమ్మెల్యే మునిరత్న ఆమె ముఖంపై మూత్రం పోశాడని తీవ్ర ఆరోపణలు చేశారు.

తనపై ఉన్న కొన్ని కేసులను తొలగిస్తానని నమ్మించి తనను తనవద్దకు రప్పించారని మహిళ పేర్కొన్నారు. అదే సమయంలో, తనకు ఒక సిరంజి ద్వారా ఇంజెక్షన్ ఇచ్చారని, ఆ తర్వాత ఆరోగ్యం విషమించిందని తెలిపారు. అనంతరం జనవరిలో వైద్యులను సంప్రదించగా, అది నయం చేయలేని వైరస్‌గా తేలిందని ఆమె ఆరోపించారు.

ఈ సంఘటనపై మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నతో పాటు ఆయన అనుచరులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషయం బయటకు రావడంతో రాజకీయంగా ఈ కేసు పెద్ద దుమారం రేపుతోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టు సమాచారం.

Read More : కర్ణాటకలో KSRTC బస్సు ప్రమాదం

One thought on “కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై మహిళ తీవ్ర ఆరోపణలు.

Comments are closed.