ఆసియా కప్ 2025లో భారత జట్టు పాల్గొనడంపై బీసీసీఐ స్పష్టం.

ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు పాల్గొననిదనే వార్తలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర ఖండన తెలిపింది. బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఆ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. టీమిండియా లేదా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగినట్లు వచ్చిన వార్తలను పూర్తిగా తిరస్కరించారు.

ఏసీసీ నిర్వహించే ఈవెంట్లపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరిపినట్లు లేదా నిర్ణయాలు తీసుకున్నట్లు లేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుత దృష్టి ఐపీఎల్ 2025 సీజన్ మరియు ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌లపై మాత్రమే ఉందని సైకియా వివరించారు.

భవిష్యత్తులో ఏసీసీ టోర్నమెంట్లపై చర్చలు జరిగితే మాత్రమే అధికారిక ప్రకటన చేస్తామన్నారు. అలాంటి సందేహాస్పద వార్తలు, ఊహాగానాలను నమ్మకూడదని ఆయన క్రికెట్ అభిమానులకు సూచించారు.

Read More : మూడు జట్లను ప్లేఆఫ్స్‌కు నడిపిన శ్రేయస్ అయ్యర్.