“బ్యాటర్ల వైఫల్యంతో భారత మహిళలకు ఆసీస్ చేతిలో ఘోర పరాజయం”

బ్యాటర్ల బోల్తా

బ్యాటర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత మహిళలు ఘోర పరాజయంతో ఆరంభించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయింది.

5 వికెట్లతో ఆసీస్ గెలుపు

బ్రిస్బేన్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మేగన్ షుట్ 5 వికెట్లతో విజృంభించింది. స్మృతి మంధాన (8), ప్రియా పూనియా (3), హర్లీన్ (19), హర్మన్‌ప్రీత్ (13), జెమీమా (23) విఫలమయ్యారు. ఓ దశలో 89/5తో ఉన్న భారత్, మరో 11 పరుగులు జోడించి ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 102/5 స్కోరు చేసి గెలుపొందింది. లిచ్‌ఫీల్డ్ (35), జార్జియా వోల్ (46 నాటౌట్) తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం అందించారు.