ముఖ్యమంత్రి యోగిని కలిసిన క్రికెటర్ మహ్మద్ షమీ.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం దాదాపు సానుకూల వాతావరణంలో సాగినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, సామాజిక పురోగతి, భవిష్యత్తు దార్శనికత వంటి అంశాలపై ఇరువురు ఆలోచనలు పంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. “ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసే గౌరవప్రదమైన అవకాశం నాకు లభించింది. మా చర్చలు దార్శనికత, నాయకత్వం, రాష్ట్ర పరివర్తన అవకాశాలపై కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యమంత్రి గారు స్థిరమైన అభివృద్ధి, సామాజిక ప్రగతిని నొక్కి చెబుతూ, రాష్ట్ర వృద్ధికి బలమైన రోడ్‌మ్యాప్‌ను వివరించారు,” అంటూ షమీ పేర్కొన్నారు.

అంతేగాక, సీఎం యోగి ఆదిత్యనాథ్‌లోని అంకితభావం తనను చాలా ప్రేరేపించిందని, ఇలాంటి నేత ఉంటే ప్రజలకు భరోసాగా ఉంటుందన్నారు. “ఉత్తరప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు నేను భాగస్వామి కావాలని ఆసక్తిగా ఉన్నాను,” అని షమీ తన సందేశంలో వెల్లడించారు.

షమీ పేసింగ్‌లో చురుకైనవాడే కాకుండా, సామాజిక అభివృద్ధిపట్ల కూడా ఆసక్తి కనబరిచిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ భేటీపై అభిమానులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Read More : IPL 2025 ప్లే ఆఫ్స్‌కు 3 జట్లు అర్హత..

One thought on “ముఖ్యమంత్రి యోగిని కలిసిన క్రికెటర్ మహ్మద్ షమీ.

Comments are closed.