హజ్ యాత్రికులకు అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచనలు.

హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచనలు చేశారు. పాకిస్తాన్ మనస్తత్వం మారాలని కోరుతూ, హజ్ యాత్రికులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని సూచించారు. “పాకిస్తాన్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉంది. వారి మనసు మారేలా దేవుడిని ప్రార్థించండి. అవసరమైతే, సరైన సమయంలో పాకిస్తాన్ బుద్ధిని మేమే మార్చుతాము” అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హజ్ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర యాత్ర యాత్రికుల జీవితాల్లో ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా హజ్ యాత్రికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించిందని తెలిపారు.

Read More : హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది: సీఎం.

One thought on “హజ్ యాత్రికులకు అసదుద్దీన్ ఒవైసీ కీలక సూచనలు.

Comments are closed.