హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కంచె సమీపంలోని గచ్చిబౌలిలో చెట్ల తివారింపు, అటవీ భూముల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా తొలగించిన చెట్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“అటవీ భూములను పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులను జైలుకు పంపించాల్సి వస్తుంది,” అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సెలవుల సమయంలోనే అకస్మాత్తుగా పనులు ప్రారంభించడం వెనుక కుట్ర ఉండే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. “అన్నీ చట్టబద్ధంగా జరిగాయంటే… సోమవారం మొదలుపెట్టినా ఏమౌతుంది? సెలవుల్లో తొందరగా ఎందుకు మొదలుపెట్టారు?” అంటూ ప్రశ్నించింది.
వేల సంఖ్యలో చెట్లు నరికి వేశారని, పెద్ద ఎత్తున బుల్డోజర్లను ఉపయోగించడం ద్వారా ఈ చర్యలు ముందస్తు పథకం ప్రకారమే జరిగాయని కోర్టు భావించింది. చెట్ల తొలగింపు వల్ల ఏర్పడిన పర్యావరణ నష్టం తక్షణమే సరిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, అప్పటి వరకు అటవీ భూముల పునరుద్ధరణపై స్పష్టమైన నివేదిక సమర్పించాలని సూచించింది.
Read More : నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.

One thought on “HCU – అధికారులకు జైలుశిక్ష హెచ్చరిక”
Comments are closed.