భారత మరియు పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది ఐపీఎల్ టోర్నమెంట్ లో మిగిలిన 17 మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ మ్యాచ్‌లు మే 17 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపధ్యంలో, భద్రతా కారణాల వల్ల బీసీసీఐ చీర్ లీడర్స్ మరియు డీజే సేవలను మిగిలిన మ్యాచ్‌లలో నిలిపివేయాలని యోచిస్తోంది. క్రీడా మైదానాల్లో కలుషితం తగ్గించడమే కాకుండా, ఉద్రిక్త పరిస్థితులలో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
ఈ విధంగా మిగిలిన 17 మ్యాచ్‌లు సాదారణంగా జరిగే వేడుకలతో కాకుండా, చీర్‌లీడర్స్, డీజేలు లేకుండా నిర్వహించబడే అవకాశం ఉంది. ఈ అంశంపై బీసీసీఐ అధికారులు మరింత చర్చలు జరుపుతుండగా, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నది.
Read More : ముస్తఫిజూర్ రహ్మాన్ ఐపీఎల్ 2025లో?

One thought on “భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్లో.?”
Comments are closed.