అఫ్జల్‌గంజ్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ పోలీస్ ఏరియాలో స్థాయిని గోల్ మసీదు సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆ భవనంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని అప్రమత్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారితో పాటు మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొని ప్రాణాపాయం నుంచి రక్షించారు.

అగ్ని ప్రమాదం వ్యాపించకుండా, సమీప భవనాలకు మంటలు తాకకుండా అగ్నిమాపక సిబ్బంది సమర్థంగా మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసు, అగ్నిమాపక శాఖల ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభమైంది.

Read More : మోసం కేసులో భార్య స్వాతి రావు విచారణలో?