మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ నేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదేళ్లపాటు ప్రజల సమస్యలపై మొహం చాటిన జగన్, ప్రజాధనాన్ని దోచుకోవడానికే పరిమితమయ్యారని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తాను ఎమ్మెల్యేగా కూడా లేని సమయంలోనే స్వంత నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని వెల్లడించారు.
లోకేశ్ మాట్లాడుతూ… “జగన్ గారు ఐదేళ్ల పాటు ప్రజల కష్టాలను గాలికి వదిలేశారు. అధికారంలో ఉంటూ ప్రజా ధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా మంగళగిరి ప్రజల సంక్షేమం కోసం ముందుకు వచ్చాను. మహిళలు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, చిన్న వ్యాపారులకు అవసరమైన సామగ్రిని, ఆర్థిక సహాయాన్ని అందించాను. ఇవన్నీ నా వ్యక్తిగత నిధులతోనే చేశాను. కులమతాలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించాను” అని తెలిపారు.
తన సేవా కార్యక్రమాల వివరాలు తెలుపుతూ లోకేశ్ చెప్పారు –
👉 మంగళగిరిలో 2022 జూన్ 20న ప్రారంభించిన స్త్రీశక్తి కేంద్రంలో ఇప్పటివరకు 43 బ్యాచ్‌లలో 2226 మందికి శిక్షణ ఇచ్చాం.
👉 తాడేపల్లిలో 2023 ఫిబ్రవరి 1న ప్రారంభించిన కేంద్రంలో 17 బ్యాచ్‌లలో 666 మందికి శిక్షణ ఇచ్చాం.
👉 దుగ్గిరాలలో 2023 ఏప్రిల్ 10న ప్రారంభించిన కేంద్రంలో 16 బ్యాచ్‌లలో 616 మందికి శిక్షణ ఇచ్చాం.
👉 మొత్తం 3508 మందికి ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు అందించాం.
“ఇది నా జేబు ఖర్చుతో, నా ఖాతాల నుంచి వెచ్చించిన సొమ్ముతో చేసిన సేవ. అందుకే మేము పార్టీ రంగు పసుపుతో మిషన్లు ఇచ్చాం. ప్రజాధనంతో కార్యక్రమాలు చేస్తే, వాటిపై వ్యక్తిగత ప్రచారం చేసుకోవాలన్న ఉద్దేశం మాకు లేదు” అని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిని కూడా లోకేశ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Read More : మురళీ నాయక్ వీరమరణంపై ఫార్మర్ సీఎం పరామర్శ
