మురళీ నాయక్ వీరమరణంపై ఫార్మర్ సీఎం పరామర్శ

జమ్మూకశ్మీర్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందిన విషయం తెలిసిందే. మురళి మృతి పై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13న జగన్ కల్లి తండాకు వెళ్లనున్నారు. ఇప్పటికే, మురళి కుటుంబ సభ్యులను జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

మురళీ నాయక్ అగ్నివీర్ పథకం కింద మూడేళ్ల క్రితం భారత ఆర్మీలో చేరారు. నాసిక్‌లో శిక్షణ పొంది, తర్వాత అసోంలో విధులు నిర్వహించారు. పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో, జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ పాక్ బలగాలను అడ్డుకునే ప్రయత్నంలో ఆయన వీర మరణం పొందారు. మురళీ మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నేతలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

Read More : అన్నమయ్య జిల్లాలో జవాన్ భూమిని కబ్జా చేసిన కబ్జాదారులు

2 thoughts on “మురళీ నాయక్ వీరమరణంపై ఫార్మర్ సీఎం పరామర్శ

Comments are closed.