హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌లో యూట్యూబర్‌పై క్యాటరింగ్ సిబ్బంది దాడి..

హేమకుంట్ ఎక్స్‌ప్రెస్‌ (14609) లో ప్రయాణిస్తున్న విశాల్ శర్మ అనే యూట్యూబర్‌పై ప్యాంట్రీ సిబ్బంది దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం, విశాల్ శర్మ రైలు లో క్యాటరింగ్ సిబ్బంది అవసరమైనదానికి ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని ఆన్‌లైన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో కోపానికి గురైన సిబ్బంది – “మా మీద ఫిర్యాదు చేస్తావా?” అంటూ యూట్యూబర్‌పై దాడికి తెగబడ్డారు. ప్రయాణికుడిని చెయ్యితో కొట్టడంతో పాటు తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై విశాల్ శర్మ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రైల్వే అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, నేరపూరిత ప్రవర్తనను సహించబోమని స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read More : దేశవ్యాప్తంగా 300 విమాన సర్వీసులు రద్దు