జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ తన ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
‘ఆపరేషన్ సిందూర్’ను దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి, రాజకీయ నాయకులు సహా ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఆపరేషన్‌ను సమర్థిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఆపరేషన్‌పై స్పందించారు. ఆయన ఎక్స్ వేదికపై పోస్ట్ చేస్తూ, భారత సైన్యాన్ని అభినందించారు.
“పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన భారత ఆర్మీకి సెల్యూట్. ఆర్మీకి ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తొలగించగల శక్తి ఉంది. జైహింద్!” అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.
Read More : తెలంగాణ సీఎం – జాతీయ ఐక్యతను ప్రదర్శించండి

One thought on “భారత సైన్యానికి మాజీ మంత్రి అభినందనలు”
Comments are closed.