ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లతో భారీ స్పందన అందుకున్న ఈ సిరీస్, ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకులను మరోసారి ఉత్కంఠకు గురిచేయనుంది. తాజాగా విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రసారమైన ఈ సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్ ఉంది. మొదటి సీజన్ విడుదలైనప్పుడు రికార్డు వ్యూస్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. రెండో సీజన్ కూడా డిసెంబర్లో విడుదలై బాగానే నడిచింది. ఇప్పుడు మూడో సీజన్‌ను మే 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సీజన్ కథలో హీరో షియెంగ్ జీ హున్ తన గెలుపుతో గేమ్ ముగిస్తానని నిశ్చయించుకుంటాడు. ఫ్రంట్ మ్యాన్ అనే మిస్టీరియస్ పాత్రను పట్టుకోవాలని ప్రయాణం మొదలుపెడతాడు. ఈ డేంజరస్ గేమ్‌ను నిలిపివేయాలన్న అతని లక్ష్యం ఈ సీజన్లో ప్రధానాంశం.
టీజర్ విడుదల చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఇచ్చిన “చివరి ఆటల సమయం వచ్చేసింది” అనే క్యాప్షన్ చూసినవారికి ఇది ఫైనల్ సీజన్ అయి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సీజన్‌తో స్క్విడ్ గేమ్ కథకు ముగింపు పలికే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.

One thought on “ప్రాణాలతో చెలగాటం మళ్లీ మొదలైంది.. స్క్విడ్ గేమ్ 3 టీజర్ రిలీజ్!”
Comments are closed.