నేడు బెంగళూరులో కీలక మ్యాచ్, ప్లేఆఫ్ ఆశలు నిలబెట్టుకునే పోరు

నేడు ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య 52వ మ్యాచ్ బెంగళూరులోని M చినస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్‌కు అరగంట ముందే ఇద్దరు కెప్టెన్లు, రజత్ పాటిదార్ మరియు MS ధోని మైదానంలోకి దిగుతారు.

ఈ సీజన్‌లో చెన్నై జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ, తమ ఆఖరి మ్యాచ్‌లో ఇతర జట్ల ప్లేఆఫ్ ఆశలను అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. మరోవైపు, RCB ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం RCB 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

పిచ్ రిపోర్ట్:

M చినస్వామి స్టేడియం బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న బౌండరీలు మరియు బంతి బౌన్స్‌లో బట్టి బ్యాట్స్‌మెన్లు పెద్ద షాట్లు ఆడగలుగుతారు. ఈ ఏడాది 4 మ్యాచ్‌లలో ఒకసారి మాత్రమే 200 పరుగుల మార్కును దాటింది. అయితే, RCB vs CSK మధ్య అధిక స్కోరింగ్ మ్యాచ్‌ను అభిమానులు ఆశించవచ్చు. ఇక్కడ 99 ఐపీఎల్ మ్యాచ్‌లలో ఛేజింగ్ జట్టు 53 సార్లు గెలిచింది, కాబట్టి ఈ రోజు టాస్ గెలిచే జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని అవకాశం ఉంది.

RCB vs CSK హెడ్ టూ హెడ్:

ఇప్పటివరకు RCB మరియు CSK జట్లు ఐపీఎల్ చరిత్రలో 34 సార్లు తలపడినాయి. ఇందులో CSK 21 సార్లు గెలిచింది. నేటి మ్యాచులో కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. గూగుల్ గెలుపు అంచనా ప్రకారం, RCBకి గెలిచేందుకు 62 శాతం, CSKకు 38 శాతం ఛాన్స్‌లు ఉన్నాయి.

ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11:

RCB: విరాట్ కోహ్లి, జాకబ్ బెతెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

CSK: షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా/విజయ్ శంకర్, MS ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

Read More : శుభ్‌మన్ గిల్‌కు ఒక మ్యాచ్ నిషేధం వస్తుందా?

One thought on “నేడు బెంగళూరులో కీలక మ్యాచ్, ప్లేఆఫ్ ఆశలు నిలబెట్టుకునే పోరు

Comments are closed.