శుభ్‌మన్ గిల్‌కు ఒక మ్యాచ్ నిషేధం వస్తుందా?

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ రెండు సందర్భాల్లో ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

మొదట తాను ఔట్ అయిన సందర్భంలో అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా ఆక్షేపం వ్యక్తం చేశాడు. అనంతరం అభిషేక్ శర్మ ఎల్బీడబ్ల్యూకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ రెండు సందర్భాల్లోనూ గిల్ తీరు ఆట మాన్యుల్ని ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం…

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఆటలో అంపైర్ల నిర్ణయాన్ని తీవ్రంగా ప్రశ్నించడం, నిరసనగా అసభ్య హావభావాలు చూపడం, తమ నిర్ణయంపై చర్చకు దిగడం వంటివి క్రమశిక్షణల ఉల్లంఘనగా పరిగణించబడతాయి. గిల్ వ్యవహారం ఇదే కోవలోకి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలాంటి ప్రవర్తనకు గిల్‌కు హెచ్చరిక, లేదా మ్యాచ్ ఫీజులో 50% వరకు జరిమానా పడే అవకాశం ఉంది. అదేవిధంగా, ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించవచ్చు. మరింత తీవ్రమైన చర్యలుగా ఒక మ్యాచ్ నిషేధం, 100% మ్యాచ్ ఫీజు జరిమానా, మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడు బీసీసీఐ, మ్యాచ్ రిఫరీ నిర్ణయం ఏంటన్నదే చూడాల్సి ఉంది.
గిల్‌కి వేటు పడితే గుజరాత్ టైటాన్స్‌కు ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

ఇలాంటి సంఘటనలు ఆట శాంతియుతంగా కొనసాగేందుకు ఆటగాళ్లు ఎంత దూరం దృష్టి పెట్టాలో సూచిస్తున్నాయి.

Read More : VK : వివరణ ఇచ్చిన క్రికెటర్

One thought on “శుభ్‌మన్ గిల్‌కు ఒక మ్యాచ్ నిషేధం వస్తుందా?

Comments are closed.