2025లో ఇంగ్లాండ్‌లో ముఖ్య వక్తగా పాల్గొననున్న బీఆర్ఎస్ నేత

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 2025లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక “ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్” (Oxford India Forum) సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొనాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు.

ఈ ఏడాది సదస్సు “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే ముఖ్య అంశంపై జరగనుంది. కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన సిద్ధార్థ్ సేఠీ వెల్లడించిన వివరాల ప్రకారం, కేటీఆర్ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో తన అనుభవాలను వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, నిపుణులతో పంచుకుంటే అది సదస్సుకు మరింత ప్రాముఖ్యతను తీసుకొస్తుందని తెలిపారు.

తెలంగాణలో చేపట్టిన టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌, వినూత్న పాలన విధానాలపై కేటీఆర్ ఈ ఫోరమ్‌లో ప్రసంగించనున్నారు. ఇది భారత దేశ ప్రగతికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే, భారతదేశం గ్లోబల్‌గా ఎలా ప్రభావం చూపుతోంది, ప్రపంచ సమస్యల పరిష్కారానికి సాంకేతికతను ఎలా వినియోగించవచ్చన్న అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ యూరప్‌లో భారత్‌కు సంబంధించి జరిగే అతి పెద్ద సదస్సు. భారత అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాంకేతికత, పరిశోధన, పాలనలో గ్లోబల్ భాగస్వామ్యాలను పెంపొందించడమే ఈ ఫోరమ్ ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.

Read More : బెట్టింగ్ బారిన పడి యువకుడి ఆత్మహత్య…

One thought on “2025లో ఇంగ్లాండ్‌లో ముఖ్య వక్తగా పాల్గొననున్న బీఆర్ఎస్ నేత

Comments are closed.