బెట్టింగ్ బారిన పడి యువకుడి ఆత్మహత్య…

మేడ్చల్ జిల్లా గౌడవెళ్లి గ్రామంలో ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ బాధలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రాహుల్ అనే 24 ఏళ్ల యువకుడు ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే… గౌడవెళ్లికి చెందిన ఆటోడ్రైవర్ యాదగిరికి ఇద్దరు కుమారులు. అతని రెండో కుమారుడు రాహుల్ ఇంటర్ విద్య పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, ఇటీవల రాహుల్ మద్యం అలవాట్లకు బానిసైపోయాడు. అంతేకాదు, ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత క్రికెట్ బెట్టింగ్‌కి దూరం లేకుండా మునిగిపోయాడు.

తాజాగా బెట్టింగ్ కోసం అప్పులు చేసి దాదాపు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టిన రాహుల్, తీవ్రంగా నష్టపోయాడు. ఆర్థిక ఒత్తిడి, కుటుంబానికి ఈ విషయం చెప్పలేక మనస్తాపానికి గురైన రాహుల్, ఇంట్లోని తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్‌లు, మద్యం వంటి అలవాట్లు యువతను ఎలా నాశనం చేస్తున్నాయనే దానికి ఇది మరొక బాధాకర ఉదాహరణగా నిలిచింది.

Read More : పాకిస్థాన్‌ జెండా వివాదం

One thought on “బెట్టింగ్ బారిన పడి యువకుడి ఆత్మహత్య…

Comments are closed.