పాకిస్థాన్ నటి సజల్ అలీకి భారత అభిమాని నుంచి గిఫ్ట్..

పాకిస్తాన్‌కి చెందిన నటి సజల్ అలీకి భారత అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఈ గిఫ్ట్‌కి ప్రత్యేకంగా ప్రాధాన్యం వచ్చింది.

ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సజల్‌కి భారతీయ అభిమాని ఒకరు ఓ బాక్స్ నిండా వాటర్ బాటిళ్లను పంపారు. ‘‘నీకు నీటి కోసం ఇబ్బంది కాకూడదు కదా..’’ అంటూ నీటితో కూడిన ఈ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ పరిణామంపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదాగా తీసుకుంటే, మరికొందరు ఇది అసభ్యంగా ఉన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలాంటి సార్కాస్టిక్ గిఫ్టులు పంపడం ఇప్పుడు ట్రెండ్ అయిందా అనేది నెట్టింట పెద్ద చర్చకే దారి తీస్తోంది.

Read More : హుగ్లీ గ్రామంలో పోస్టర్ అతికించబడిన ఘటన

One thought on “పాకిస్థాన్ నటి సజల్ అలీకి భారత అభిమాని నుంచి గిఫ్ట్..

Comments are closed.