శంకర్ కెరీర్‌లో భారీ బ్రేక్: రెండేళ్ల విశ్రాంతి?

Shankar taking a 2-year break

టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ ఫలితం శంకర్‌కు నిరాశను మిగిల్చింది. మొదటి తెలుగు సినిమా అందించిన పరాభవం తరువాత, శంకర్ మరో సినిమా ప్రకటన చేసే అవకాశం కోల్పోయారు. ప్రస్తుతం ఆయనకు భారతీయుడు 3 మాత్రమే చేతిలో ఉంది.

భారతీయుడు 2 అపజయం భారతీయుడు 3 పై ప్రభావం చూపింది. ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న ప్రచారం రాగా, మేకర్స్ థియేట్రికల్ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు సినిమా ఆలస్యం అయినా, ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని భావిస్తున్నారు.

కొత్తగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, భారతీయుడు 3 తర్వాత శంకర్ రెండు సంవత్సరాలు విరామం తీసుకోనున్నారు. ఈ గ్యాప్‌లో కొత్త స్క్రిప్ట్‌లపై పరిశీలన చేసే అవకాశముందని తెలుస్తోంది.

శంకర్ సాధారణంగా సినిమాల మధ్య గ్యాప్ తీసుకోవడం అలవాటే అయినా, ఈసారి విరామం మరింత ఎక్కువగా ఉండొచ్చని టాక్. బలమైన రైటర్ సహకారంతో శంకర్ తిరిగి మళ్లీ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read More



One thought on “శంకర్ కెరీర్‌లో భారీ బ్రేక్: రెండేళ్ల విశ్రాంతి?

Comments are closed.