బాలీవుడ్‌ టచ్‌తో టాలీవుడ్‌లోకి కొత్త భామ!

Arthi Gupta Tollywood debut

ఇండస్ట్రీలో ప్రతిభతో పాటు అదృష్టం కలిసొస్తేనే సక్సెస్ సాధ్యం అవుతుంది. ప్రతి సంవత్సరం ఎందరో కలలు, ఆశయాలతో తెరంగేట్రం చేస్తున్నా.. స్థిరపడేది మాత్రం కొంతమంది మాత్రమే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పోటీ తారాస్థాయిలో ఉంటుంది. సక్సెస్ అయిన కొత్త వారే ముందు వరుసలోకి వచ్చి సీనియర్‌లతో కలిసి పనిచేస్తూ స్థిరమవుతుంటారు.

ఇప్పుడిదే ట్రాక్‌లోకి వస్తోంది మరో నూతన భామ ఆర్తీ గుప్తా. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘సోదరా’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాపై తాను ఎంతో నమ్మకంగా ఉందని, హిట్ కొట్టి టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారాలన్న లక్ష్యంతో ఉందని చెప్పింది.2

ఆర్తీ గుప్తా అసలు నివాసం చండీగఢ్ కాగా, ప్రస్తుతం ముంబైలో నివసిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన అనుభవంతోనే ఇప్పుడు టాలీవుడ్‌కి అడుగుపెట్టినట్టు చెప్పింది. అన్ని రకాల పాత్రల్ని చేయాలన్న ఆసక్తితో పాటు, బాలీవుడ్‌ నటి అలియా భట్ నటన తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.2

టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు అభిమానిగా ఉన్న ఆర్తీ, పవర్ఫుల్ పాత్రలు చేయాలన్న ఆశతో ముందుకు సాగుతోంది. టాలీవుడ్‌ ఎప్పుడూ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ఇండస్ట్రీ. ముంబై బ్యూటీ ఆర్తీ గుప్తా టాలీవుడ్‌లో ఎలాంటి ఛాన్సులు దక్కించుకుంటుందో వేచి చూడాలి.

Read More

One thought on “బాలీవుడ్‌ టచ్‌తో టాలీవుడ్‌లోకి కొత్త భామ!

Comments are closed.