పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు భౌతికకాయం స్వగ్రామానికి బుధవారం చేరుకుంది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ ఈ దాడిలో మృతి చెందాడు.
మృతదేహం ఇంటికి చేరగానే గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. మధుసూదన్ ఇంటివద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఊరంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థాయిలో సహాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
Read More : తిరుమల – కర్ణాటక భక్తులు గాయాలు

One thought on “పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు యువకుడి …”
Comments are closed.