పీఎస్‌ఎల్‌లో షాహీన్ అఫ్రిదీకి లాహోర్ ఖలందర్స్ నుంచి గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్ గిఫ్ట్

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆటగాళ్లకు విభిన్నమైన గిఫ్ట్‌లు ఇవ్వడం పై మరో ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల కరాచీ జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్లకు హెయిర్ డ్రయ్యర్లు, ట్రిమ్మర్లను గిఫ్ట్‌గా ఇవ్వగా, విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లాహోర్ ఖలందర్స్ యాజమాన్యం అందుకు పూర్తి భిన్నంగా స్పందించింది.

లాహోర్ ఖలందర్స్ యాజమాన్యం తమ కెప్టెన్ షాహీన్ అఫ్రిదీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ యాపిల్ ఐఫోన్ 16 ప్రోను బహుమతిగా అందించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ ఫోన్‌ ధర సుమారుగా రూ. 3 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ఈ ప్రత్యేక గిఫ్ట్‌కు సంబంధించిన వీడియోను లాహోర్ ఖలందర్స్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసింది. ఈ సీజన్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టు మంచి ఫామ్‌ చూపిస్తోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Read More : “బీసీసీఐ 2025 సెంట్రల్ ఒప్పందాల జాబితా: ఇషాన్ కిషన్‌కు ఆశ్చర్యకరమైన చోటు.

One thought on “పీఎస్‌ఎల్‌లో షాహీన్ అఫ్రిదీకి లాహోర్ ఖలందర్స్ నుంచి గోల్డ్ ప్లేటెడ్ ఐఫోన్ గిఫ్ట్

Comments are closed.