హాలీవుడ్ ముద్దుగుమ్మ క్రిస్టెన్ స్టీవర్ట్ చివరికి పెళ్లి చేసుకుంది. తన సుదీర్ఘ కాలం ప్రియురాలు అయిన డిలన్ మేయర్ను వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. గత ఆరు సంవత్సరాలుగా సహ జీవనం సాగిస్తున్న ఈ జంట, 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా ఏప్రిల్ 20న, ఉంగరాలు మార్చుకుంటూ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు.
లాస్ ఏంజిల్స్‌లోని క్రిస్టెన్ నివాసంలో, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే వివాహం జరిపినట్టు సమాచారం. ఇద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను కూడా తీసుకున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రిస్టెన్ స్టీవర్ట్, 2013లో ఓ సినిమా సెట్లో డిలన్ మేయర్‌ను కలిసారు. అప్పటి పరిచయం ప్రేమగా మారి, దాదాపు పదేళ్ల పాటు సుస్థిరమైన బంధంగా కొనసాగింది. ఒకే జెండర్ ప్రేమపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూ, చివరకు ఇద్దరూ తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకున్నారు.
“ట్విలైట్” సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టెన్, పలు అవార్డులు కూడా అందుకున్నారు. సినిమాల్లో నటిగా, రచయితగా డిలన్ మేయర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ప్రస్తుతం ఈ జంటపై అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు.

One thought on “పెళ్లి బంధంతో ఒక్కటైన క్రిస్టెన్ స్టీవర్ట్, డిలన్ మేయర్”
Comments are closed.