తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమైంది.
ఈ నెల 22వ తేదీ ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలు విడుదలైన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేపట్టింది.
Read More : మంత్రి పొంగులేటి సమీపంలో మంటలు!

One thought on “తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు తేదీ ఫైనలైజ్డ్..?”
Comments are closed.