నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని మోడల్ కాలేజీ ఎస్సీ హాస్టల్‌లో హాస్టల్ వార్డెన్ శ్రీశైలం అనుచిత ప్రవర్తన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ప్రతి రోజు మద్యం సేవించి హాస్టల్‌కు వచ్చిన ఆయన, విద్యార్థులపై అసభ్య పదజాలంతో దూషణలు చేస్తూ, మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా సరిపోగా, హాస్టల్‌లో భోజన వ్యవస్థలోనూ తీవ్ర అవకతవకలు కొనసాగుతున్నాయని, ప్రతిరోజూ ఇవ్వాల్సిన మెనూను పక్కాగా పాటించకపోగా, నాణ్యతలో కూడా తేడాలు ఉంటున్నాయని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్‌లో జీవన నాణ్యత దిగజారిపోతుండటంతో పరిస్థితిని భరించలేక, చివరికి హాస్టల్ ప్రాంగణంలోనే విద్యార్థులు నిరసనకు దిగారు.
వార్డెన్ తీరుపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, హాస్టల్‌లో విద్యార్థులకు సరైన భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Read More : వరంగల్: మూడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం…
