అమెరికాలో విమానం ఇంజిన్‌లోకి కుందేలు..

అమెరికాలోని డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో అరుదైన ఘటనతో ఒక విమానం ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంది. డెన్వర్ నుండి ఎడ్మింటన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ సమయంలో రన్‌వేపై అనుకోకుండా ఓ కుందేలు ఇంజన్‌లోకి ప్రవేశించింది. కుందేలు ఇంజన్‌లోకి వెళ్లిన వెంటనే ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు.

వెంటనే విమాన సిబ్బంది అపాయకర స్థితిని గుర్తించి, అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన అనంతరం విమానాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, ఇంజన్‌ను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్ట్ టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగింది.

ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, పైలట్ల వేగవంతమైన స్పందన వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. కుందేలు ఎలా రన్‌వేపైకి వచ్చిందన్నదానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. రన్‌వే భద్రత పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం ప్రకటించింది.

Read More : లాస్‌ఎంజెలిస్‌లో ప్రపంచంలో తొలి స్పర్మ్ రేస్ ఏప్రిల్ 25న