టాలీవుడ్ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ మరోసారి వార్తల్లోకెక్కింది. పూరీ జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించటం అందరికీ తెలిసిందే. గతంలో లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో నిరాశ ఎదురైన ఛార్మీ.. ఈ సినిమాతో మళ్లీ హిట్టు కొట్టాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఛార్మీ తాజాగా తన డైట్ గురించి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. “నా జీవితం పోర్షన్ కంట్రోల్ గా మారింది” అంటూ పేర్కొంటూ, తాను తీసుకునే ఆహారపు వివరాలు పంచుకుంది. 114 గ్రాముల చేప, 52 గ్రాముల ఇడ్లీ, 100 గ్రాముల అన్నం వంటి వివరాలతో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చాలా కాలం తర్వాత ఛార్మీ ఇలా తన లైఫ్‌స్టైల్ గురించి మాట్లాడటంతో అభిమానులు తెగ రెస్పాండ్ అవుతున్నారు. బ్లాక్ డ్రెస్‌లో గ్లామరస్‌గా ఉన్న ఛార్మీ ఫోటోపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఎవరూ ఊహించని ఛేంజ్”, “ఎవర్‌గ్రీన్ బ్యూటీ”, “గోర్జియస్ లుక్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా విజయ్ సేతుపతితో తెరకెక్కుతున్న సినిమా గురించి కూడా పెద్దగా చర్చ జరుగుతోంది. లైగర్ ఫెయిల్యూర్ తర్వాత ఈ ప్రాజెక్టుతో ఛార్మీ పూరీ జోడీ తిరిగి ఫామ్‌లోకి వస్తారా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

One thought on “సినిమా అప్‌డేట్‌తో పాటు తన డైట్ ప్లాన్ షేర్ చేసిన చార్మీ!”
Comments are closed.