మలయాళ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్, తెలుగులో ‘అంటే సుందరానికి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాని సరసన నటించిన ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అయితే, తెలుగులో ఆమె మరొక సినిమాకు సంతకం చేయలేదు, కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను మరింత పైకి తీసుకెళ్లింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నజ్రియా, ఇటీవల కాలంలో మౌనంగా మారింది.
‘బెంగుళూరు డేస్’ సినిమాలో ఫహద్ ఫాజిల్‌తో కలసి నటించిన నజ్రియా, షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడి, తర్వాత పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్‌లో బిజీ అయిపోయారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తూ కొనసాగుతుండగా, ఫహద్ ఫాజిల్ తెలుగులో ‘పుష్ప 2’తో భారీ హిట్ అందుకున్నాడు.
ఇటీవల నజ్రియా తన మౌనంపై ఓ ఎమోషనల్ మెసేజ్‌తో స్పందించింది. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత సవాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. డిప్రషన్‌కు లోనై, పుట్టినరోజు, నూతన సంవత్సరం వేడుకలు వంటి ముఖ్యమైన క్షణాలను మిస్ అయ్యానని చెప్పింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులకు క్షమాపణలు చెప్పింది.
నజ్రియా ఈ పరిస్థితి నుంచి త్వరలో కోలుకుంటానని హామీ ఇచ్చింది. ఆమె భావోద్వేగ పోస్ట్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నజ్రియా పోస్ట్‌పై స్టార్ హీరోయిన్ సమంత స్పందిస్తూ లవ్ సింబల్ షేర్ చేయడం అభిమానులకు మరింత ఆసక్తి రేపింది.

2 thoughts on “నజ్రియా నజీమ్: విడాకుల వార్తల మధ్య, సమంత స్పందన!”
Comments are closed.