ఇండియా స్థాయిలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఓదెల 2 ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మికత, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లు, పోస్టర్లకు మంచి స్పందన లభించింది. తమన్నా లుక్, నటన చూసి ప్రేక్షకులు ఆమెను మరో “అమ్మోరు”, “అరుంధతీ”లా భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చిత్రాలకు తెలుగులో కొదవే అనిపించింది. ఈ నేపథ్యంలో ఓదెల 2పై ఆసక్తి పెరిగింది.
తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు అశోక్ తేజ ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “సిటీమార్ సినిమా సమయంలో తమన్నాతో ఫోటో కావాలని సంపత్ నందిని అడిగాను. అప్పుడే ఆయన ఫోటో కాదు, సినిమానే ఇస్తానన్నారు. ఆ మాట ప్రకారం, ఇప్పుడు తమన్నానే హీరోయిన్‌గా నాకు ఇచ్చారు. ఓదెల 2లో ఆమెను డైరెక్ట్ చేయడం నిజంగా నాకు గర్వకారణం,” అని ఆయన పేర్కొన్నారు. వినూత్నమైన విజువల్స్‌తో ఈ సినిమా తెరపై భిన్నమైన అనుభూతిని అందించబోతోందని చెప్పారు.
తమన్నా ఇప్పటి వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొన్ని ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ, ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం ఇదే తొలిసారి. ఓదెల 2 మంచి విజయాన్ని సాధిస్తే, తమన్నా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. “అరుంధతీ”లో అనుష్క, “అమ్మోరు”లో సౌందర్య లాగా ఆమె ఈ సినిమాలో మంచి గుర్తింపు పొందుతుందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

One thought on “తమన్నా పాత్ర మీదే సినిమా నడుస్తుంది – అశోక్ తేజ”
Comments are closed.