కంచ్ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, వాటికి అటవీశాఖ లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)కి ఎలాంటి సంబంధం లేదని రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియజేసినట్లుగా, కంచ్ గచ్చిబౌలి భూములు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండటం వల్ల చెట్లు మొలిచిపోతూ అడవిలాగా కనిపిస్తున్నాయి.
ఏప్రిల్ 16వ తేదీ లోగా కంచ్ గచ్చిబౌలి భూములపై నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సీఎస్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శనివారం ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కార్యదర్శి సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
అఫిడవిట్లో, నిబంధనల ప్రకారం మాత్రమే చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. అటవీశాఖ అనుమతి అవసరమైన చెట్లు పైన పరిమిత సంఖ్యలోనే ఉన్నాయని, వాటి జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.
ఈ నెల 16వ తేదీన “బీ ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ” దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
Read More : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై పోలీసుల సీరియస్ దర్యాప్తు

One thought on “కంచ్ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే – సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్ అఫిడవిట్”
Comments are closed.