తెలుగులో టామ్ చాకోకి సరైన అవ‌కాశాలు లభిస్తున్నాయా?

Shine Tom Chako's limited roles in Telugu cinema

మాలీవుడ్ టాలెంటెడ్ నటుడు షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన భిన్నమైన నటనతో మలయాళంలో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో దసరా, రంగబలి, దేవర వంటి సినిమాల్లో కనిపించినప్పటికీ, నటన పరంగా తన మార్క్ వేసినప్పటికీ పాత్రలు మాత్రం పరిమితంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన అజిత్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ, నితిన్ నటించిన రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో టైమ్ చాకో పాత్రలు చాలా చిన్నవిగా మిగిలిపోయాయి. తెరపై కనిపించిన కొద్ది సేపే తన హావభావాలతో ఆకట్టుకున్నా, పాత్ర నిడివి ఎక్కువైతే ఇంకా బాగా వర్క్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎంతో టాలెంట్ ఉన్న నటుడైనా సరే.. సరైన ఛాన్సులు లేకపోతే ప్రేక్షకుల ముందు తన ప్రతిభను చూపించలేడు. టైమ్ చాకో పాత్రలు పెద్దగా ప్రభావం చూపించలేని స్థాయిలో మిగిలిపోతున్నాయి. ప్రతి సినిమా చూసిన వారు – “ఇంకా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండాల్సింది” అనే అభిప్రాయమే వినిపిస్తోంది. దురదృష్టవశాత్తూ, ప్రస్తుతం అతడు చిన్న పాత్రలకే పరిమితం అవుతున్నాడు.

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ ‘పుష్ప’తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నా, ఆయనకూ సరైన ఛాన్సులు రాలేదన్న విమర్శలున్నాయి. ఆయన కూడా కొన్ని అవకాశాలను తానే వదులుకున్నట్లు తెలిపాడు. అలాంటి ఛాన్సులు టైమ్ చాకోకు వస్తే మాత్రం పూర్తి స్థాయిలో వాడుకుంటాడేమో అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి తెలుగు దర్శకులు ఈ విలక్షణ నటుడికి పూర్తిస్థాయి పాత్ర ఎప్పుడిస్తారో చూడాలి!

Read More


One thought on “తెలుగులో టామ్ చాకోకి సరైన అవ‌కాశాలు లభిస్తున్నాయా?

Comments are closed.