సిటీ షోస్టాపర్స్‌కి షైన్‌ ఇచ్చిన రకుల్‌ గ్లామర్‌ లుక్‌

Rakul Preet Singh photoshoot

స్టన్నింగ్‌ అందాలతో సినీ ప్రేక్షకులను మెప్పించిన టాలెంటెడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తాజాగా సిటీ షోస్టాపర్స్ కోసం ఓ స్పెషల్‌ ఫోటోషూట్‌ చేసింది. ఈ ఫోటోషూట్‌లో ఆమె స్టైలిష్‌ అవతారంతో అభిమానుల చూపులను కట్టిపడేసింది. కవర్‌ స్టిల్‌లో రకుల్‌ సింప్లీ సెన్సేషనల్‌గా మెరిసిపోతుండగా, సోషల్ మీడియాలో ఈ స్టిల్స్ వైరల్‌ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో ‘కెరటం’ సినిమాతో అడుగుపెట్టిన రకుల్‌, ఆ తర్వాత ‘వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్‌’ వంటి హిట్స్‌తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లో నటించిన రకుల్‌ దశాబ్దానికి పైగా సౌత్‌లో తనదైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకుంది. మహేష్‌బాబు, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఘనత కూడా ఆమె సొంతం చేసుకుంది.

ప్రస్తుతం రకుల్‌కు సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా ఆఫర్లు లేకపోయినా, బాలీవుడ్‌ చిత్రాల్లో మాత్రం ప్యాచ్‌వర్క్‌ రోల్స్‌తో కనిపిస్తూ ఉంది. ఇటీవల ‘మేరే హస్బెండ్‌ కీ బివి’ సినిమాతో వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ ఎదురైంది. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే 2’ లో నటిస్తోంది. అయితే సినిమాల పరంగా మిడ్ రేంజ్‌ గానే ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రకుల్‌కి భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె 24 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉండటం విశేషం. తరచూ అందాల ఫోటోషూట్లు, ఫిట్‌నెస్ వీడియోలు షేర్‌ చేస్తూ యువతను ఆకట్టుకుంటోంది. సినిమాల్లో అవకాశం తక్కువైనా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మోడలింగ్‌, ఫ్యాషన్‌ ఫోటోషూట్ల ద్వారా తన గ్లామర్‌ను రెట్టింపు చేస్తోంది.

Read More


One thought on “సిటీ షోస్టాపర్స్‌కి షైన్‌ ఇచ్చిన రకుల్‌ గ్లామర్‌ లుక్‌

Comments are closed.