వారణాసిలో గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇటీవల 19 ఏళ్ల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఉదయం వారణాసిలో పర్యటించిన ప్రధాని, విమానాశ్రయానికి చేరిన వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బాధిత యువతి పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అత్యంత అమానుషంగా జరిగిన ఈ ఘటనలో నిందితులపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రధాని ఆదేశించినట్లు సమాచారం. బాధితురాలికి మత్తు ఇచ్చి, నగరంలోని పలు ప్రాంతాలకు తరలిస్తూ మొత్తం 23 మంది వ్యక్తులు ఆరు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది.

ఈ కేసును అత్యంత సమగ్రంగా దర్యాప్తు చేసి, బాధితురాలికి న్యాయం కల్పించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : వరణాసిలో 19ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి..

One thought on “వారణాసిలో గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్

Comments are closed.