నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. మొదటి రెండు రోజులు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, అదే సీజన్లో విడుదలైన వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పోటీ తలెత్తింది. దీనివల్ల థియేటర్లలో ‘డాకు మహారాజ్’ వసూళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో, ఫ్యాన్స్ మళ్లీ దీన్ని హిట్‌గా ప్రకటించుకున్నారు.

ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కొన్న వారు మాత్రం కొన్ని చోట్ల నష్టపోయారని సమాచారం. అయినప్పటికీ, డాకుమహారాజ్ నిర్మాతకు బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యిందని టాక్ వినిపిస్తుంది. బాలయ్య కెరీర్లో వరుసగా మూడో విజయంగా చిత్ర బృందం ఈ సినిమాను ప్రచారం చేస్తోంది. సినిమా పాజిటివ్ టాక్‌ను పొందినప్పటికీ, వసూళ్లు తగ్గిపోవడం వల్ల థియేటర్ పరంగా ఆశించిన లాభాలు సాధించలేకపోయింది.

ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో నటించిన తన పాత్రను ప్రమోట్ చేస్తూ “దబిడి దిబిడి” పాటను హిట్‌గా చాటుతూ తెగ ప్రచారం చేస్తున్నారు. వివాదాస్పద “దబిడి దిబిడి” పాటలో కనిపించడంతో పాటు, సినిమాలో ఎక్కువ స్క్రీన్ టైమ్ రావడం ఆమెకు మంచి పబ్లిసిటీ తీసుకొచ్చింది.

ఈ పాటకు వచ్చిన స్పందనను ఉపయోగించుకుని, ఊర్వశి మరిన్ని ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐటెం సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా ద్వారా ఆమెకు మంచి అవకాశాలు రావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

One thought on “బాలయ్య మూవీ హైప్‌తో ఊర్వశి లైమ్‌లైట్‌లోకి!”
Comments are closed.