ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. అయినా ఎనర్జీ తగ్గని మంజరి

Manjari Fadnnis Telugu actress

తెలుగు ప్రేక్షకులకు సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో పరిచయమైన మంజరి ఫడ్నిస్, నటనతోనే కాకుండా తన గ్లామర్‌ లుక్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తెలుగులో ఆమె చేసిన సినిమాల సంఖ్య తక్కువైనా, ఆ పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఈ మధ్య సినిమాల్లో కనిపించకపోయినా, మంజరి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోషూట్లతో వైరల్ అవుతూ ఉంటుంది. 2004లో హిందీలో అడుగుపెట్టిన ఈ భామ, 2008లో తెలుగు తెరపై అడుగుపెట్టి సిద్దు ఫ్రమ్‌ సికాకుళంతో మంచి హిట్ అందుకుంది.

తెలుగులో ఆ తర్వాత వరుసగా కొన్ని సినిమాలు చేసిన మంజరికి, స్టార్ హీరోలతో అవకాశాలు రాకపోవడం కొంతవరకు నిరాశను మిగిల్చింది. దీంతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్‌, కన్నడ, మరాఠీ సినిమాల్లో ఆమె కెరీర్‌ కొనసాగింది. ఆమెకు జానే తు యా జానే నా వంటి హిట్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోనూ గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె ఒక హిందీ సినిమా, ఒక మరాఠీ సినిమాతో బిజీగా ఉంది. తన గ్లామర్‌తో పాటు, మంచి నటనతో విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్న మంజరి, ఇటీవల షేర్ చేసిన బ్రా లెస్ అవుట్‌ఫిట్‌లోని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ స్థాయిలో గ్లామర్‌, టాలెంట్ ఉన్నప్పటికీ మంజరికి లభించాల్సిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంపై సినీ అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తిచేసిన ఆమె, ఇకనైనా తనకు తగిన మంచి అవకాశాలు రావాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read More

One thought on “ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. అయినా ఎనర్జీ తగ్గని మంజరి

Comments are closed.