బాలీవుడ్ చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ (82) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సలీం అక్తర్ మృతి వార్త తెలిసిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు, సహనిర్మాతలు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.
సలీం అక్తర్ సినీ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన నిర్మాత. 1997లో “రాజా కీ ఆయేగా బరాత్” సినిమాతో రాణీ ముఖర్జీని బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. తరువాత “చాంద్ సా రోషన్ చెహ్రా” (2005) సినిమాతో తమన్నాను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆమీర్ ఖాన్, బాబీ డియోల్ వంటి ప్రముఖ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో అక్తర్ కీలకపాత్ర పోషించారు.
సినిమా రంగానికి సలీం అక్తర్ చేసిన సేవలు అనిర్వచనీయమైనవని పలువురు ప్రముఖులు తెలిపారు. ఆయన మృతి బాలీవుడ్‌కు తీరని లోటుగా భావిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ముంబైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. చివరి వరకు సినిమా మీద ప్రేమను కొనసాగించిన ఈ దిగ్గజ నిర్మాతకు సినీ ప్రియులు నివాళులు అర్పిస్తున్నారు.

One thought on “బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ కన్నుమూత”
Comments are closed.